Mana Exams

  • home
  • about
  • contact
  • learn

రైల్వేలో 2794 ఉద్యోగాల బర్తీ కి నోటిఫికేషన్ విడుదల -Indian Railway

Posted by Unknown in: jobs railway
railway-jobs-2015
రైల్వేలో ఉద్యోగాల ప్రకటన వెలువడింది. తాజా సమాచారం ప్రకారం రైల్వేలో 2794 ఉద్యోగాల బర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేశారు.
బాగా చదివి జాబ్ కొట్టుకున్నవారికి మంచి జీతాలతో పాటు అనేక వసతులు మరియు ఇతర అలవెన్సేలు కలిగైన సదుపాయం.
ఇ ఉద్యోగాలు కేవలం (బిటెక్) ఇంజనీరింగ్ మరియు డిప్లొమా చేసినవారికే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇ రైల్వే జాబ్స్ నోటిఫికేషన్ జూనియర్ ఇంజినీర్, డిపొ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, సీనియర్ సెక్షన్ ఇంజినీర్, చీఫ్ డిపొ మెటీరియల్ సూపరింటెండెంట్ కోసం.
అర్హతలు

అర్హతలు : బీటెక్/బీఈ, డిప్లొమా, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ/ఎలక్ట్రానిక్స్ విద్యార్హత వుండాలి.

వయస్సు: 2015, జూలై 1 నాటికి జూనియర్ ఇంజినీర్స్‌కు 18-32 years, సీనియర్ ఇంజినీర్స్‌కు 20-34 years మధ్య ఉండాలి.

ఎస్సీ/ఎస్టీలకు 5 years, ఓబీసీలకు 3 years, పీహెచ్‌సీ అభ్యర్థులకు 10 years, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు 3 years వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఫీజు: రూ. 100/-. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళలు, మైనార్టీ, పీహెచ్‌సీ, ఈబీసీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్: www.indianrailways.gov.in/railwayboard

సికింద్రాబాద్ ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్: www. rrbsecunderabad.nic.in ఫోన్ నంబర్ – 040 -27821663.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌లో నిర్వహించే రాతపరీక్ష ద్వారా చేస్తారు.

ఆన్‌లైన్ టెస్ట్‌లు: ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 5.
చివరితేదీ: జూలై 26.
ఖాళీల వివరాలు

సీనియర్‌సెక్షన్ ఇంజినీర్/పీవే – 222

సీనియర్ సెక్షన్ ఇంజినీర్/బ్రిగేడ్ – 28

సీనియర్ సెక్షన్ ఇంజినీర్ (వర్క్స్)- 51

సీనియర్ సెక్షన్ ఇంజినీర్ డ్రాయింగ్ (సివిల్) డిజైన్ అండ్ ఎస్టిమేషన్ – 23

సీనియర్ సెక్షన్ ఇంజినీర్ (రీసెర్చ్)- 3

సీనియర్ సెక్షన్ ఇంజినీర్ (టీఎంఎస్)- 1

సీనియర్ సెక్షన్ ఇంజినీర్ (మెకానికల్/వర్క్‌షాప్)- 85

సీనియర్ సెక్షన్ ఇంజినీర్ (మెకానికల్)- 125

సీనియర్ సెక్షన్ ఇంజినీర్ (క్యారేజ్ అండ్ వ్యాగన్)- 118

ఇవే కాకుండా సీనియర్ సెక్షన్ ఇంజినీరుల్లో డీఎస్‌టీ మెకానికల్ -14, డీఎస్‌ఎల్ ఎలక్ట్రికల్ -10, జిగ్ అండ్ టూల్స్ -1, ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్(జీఎస్)-105, ఎలక్ట్రికల్ (టీఆర్‌డీ)-85, ఎలక్ట్రికల్ (టీఆర్‌ఎస్)-40, ఎలక్ట్రికల్ వర్క్‌షాప్-13, ఎలక్ట్రికల్ డ్రాయింగ్, డిజైనింగ్ -9, సిగ్నల్ -56, టెలీకమ్యూనికేషన్ -46, ఎస్ అండ్ టీ -2, డ్రాయింగ్ ఎస్ అండ్ టీ -1, ట్రాక్‌మిషన్ -36, పీసీవో-2 ఖాళీలు ఉన్నాయి.

చీఫ్ డిపొ మెటీరియల్ సూపరింటెండెంట్ -25, జూనియర్ ఇంజినీర్ (పీవే)-65, వర్క్ -21, బ్రిడ్జ్-24, సివిల్ డిజైన్, డ్రాయింగ్- 58, ఎస్‌టీఆర్ -2 తదితర ఖాళీలు ఉన్నాయి.
ఎంపిక విధానం

ఇది పూర్తిగా ఆబ్జెకివ్ విధానంలో ఉంటుంది.

ప్రశ్నపత్రం ఇంగ్లీష్/హిందీ/స్థానిక భాషల్లో ఉంటుంది.

జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ సైన్స్, టెక్నికల్ ఎబిలిటీపై ప్రశ్నలు ఇస్తారు.

పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 90 ప్రశ్నలు టెక్నికల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ నుంచి, 60 ప్రశ్నలు జనరల్ అవేర్‌నెస్, అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ నుంచి ఇస్తారు.

90 మార్కుల టెక్నికల్ ఎబిలిటీలో సంబంధిత బ్రాంచీకి చెందినసైన్స్, ఇంజినీరింగ్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.

నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1/3 మార్కు కోత విధిస్తారు. పరీక్ష కాలవ్యవధి – రెండు గంటలు. అంటే 150 ప్రశ్నలు – 120 నిమిషాలు

ఆన్‌లైన్ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారుచేసి మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌కు పంపిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఉద్యోగాన్ని ఇస్తారు.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్

1 comment:

  1. Sarkari Results23 January 2016 at 02:10

    Thanks for sharing such a nice article Sarkari Result your idea is mind blowing that's why i would like to appreciate your work.

    ReplyDelete
    Replies
      Reply
Add comment
Load more...

Older Post Home

Popular Posts

  • TSPSC Government Jobs In Telangana-Recruitment For 15222 Posts
  • రైల్వేలో 2794 ఉద్యోగాల బర్తీ కి నోటిఫికేషన్ విడుదల -Indian Railway
  • ఇండియన్ రైల్వేలో 651 ఉద్యోగాలు-Indian Railway Jobs

About Mana Exams

  • Education
  • Jobs
  • Meterial
  • Tspsc

Featured Content

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer

Featured

  • Education
  • Jobs
  • Meterial
  • Tspsc

"© Copyright 2015" Mana Exams · All Rights Reserved · And Our Sitemap · All Logos & Trademark Belongs To Their Respective Owners·